
రుద్రూర్, అక్టోబర్ 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండలంలోని అక్బర్ నగర్ ఆహార శాస్త్రం మరియు విజ్ఞాన కళాశాలలో గురువారం జాతీయ ఆహార దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కే. వెంకట్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్బంగా విద్యార్థిని, విద్యార్థులకు రంగోలి, వంటల పోటీలు, వ్యాసరచన తదితర పోటీలు నిర్వహించినట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి డాక్టర్ పవన్ చంద్ర రెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ హిందూధర్ రెడ్డి, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ కే వెంకట్ రెడ్డి, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ భాను చంద్రారెడ్డి,కామదేను ఫుడ్ ఇండస్ట్రీ సీఈఓ వెంకటేశం, కళాశాల దత్తత గ్రామమైన రాయకూర్ గ్రామ మహిళలు, రైతులు, రాయకాల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, కళాశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
