
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 17(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రామకృష్ణ గవాయి. పై దాడికి యాడికి మండలం లో చెన్నకేశవస్వామి గుడి దగ్గర నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు ర్యాలీ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎమ్మార్పీఎస్, ఎం.ఎస్పి ఇంచార్జ్ ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు మాదిగ అనంతపురం జిల్లా అధ్యక్షులు బి హరిగోపాల్ మాదిగ ఆధ్వర్యంలో ఈరోజు యాడికి మండలం ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం ముందు భారీ ఎత్తున నిరసన తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, ఎం. ఎస్.పి మరియు అనుబంధ సంఘాలు హాజరయ్యారు వారు మాట్లాడుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు నందు చీఫ్ జస్టిస్ రామకృష్ణ గవాయి గారిపై దాడి జరగడం రాజ్యాంగం పై దాడి జరిగినట్టుగా భావిస్తున్నాం ఈ భారత దేశంలో దళిత వర్గాల ప్రజలు ఏ స్థాయిలో ఉన్న ఇలాంటి అగత్యాలు జరగడం చాలా బాధాకరమైన విషయం ఈ దాడికి పాల్పడినటువంటి వారిని వెంటనే శిక్షించి వారి వెనుక ఉన్న ఎంత పెద్ద శక్తులైన వారికి కూడా శిక్ష పడే విధంగా కేసు విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, మండల అధ్యక్షులు బాలు పాతకుంట్ల మాదిగ, ఎమ్మార్పీఎస్. యాడికి మండల గౌరవ అధ్యక్షులు వెంగళ శ్రీనివాసులు మాదిగ, ఎమ్మార్పీఎస్. మండల ప్రధాన కార్యదర్శి జానకి రాముడు మాదిగ, ఎమ్మార్పీఎస్, మండల ఉపాధ్యక్షులు చిటికెల చిరంజీవి మాదిగ, ఎమ్మార్పీఎస్. మండల ఉపాధ్యక్షులు నల్లప్ప మాదిగ,ఎమ్మార్పీఎస్. మండల కోశాధికారి విజయ్ఎమ్మార్పీఎస్. మండల కార్యదర్శి సాగర్ మాదిగ,నరసింహులు మాదిగ సూర్యుడు మాదిగ,గాంధీ మాదిగ, కులాయప్ప మాదిగ, రామాంజనేయులు మాదిగ, డి వెంకటేష్ మాదిగ, గుర్రప్ప మాదిగ, రవికుమార్ మాదిగ, టైలర్ పుల్లయ్య మాదిగ,టైలర్ బద్రి మాదిగ, పండు శ్రీరాములు మాదిగ, శంకర్ మాదిగ, నాగేష్ మాదిగ, సూర్యనారాయణ మాదిగ, చిన్న రాముడు మాదిగ, మండలంలోని గ్రామాల డప్పు కళాకారులు మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది…
