
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మక్తల్
అంబేద్కర్ యువజన సంఘం.మక్తల్.
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 18} మక్తల్
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గావాయ్ బెంచ్ మీద లాయర్ల వాదన వింటున్న సమయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి ష్యు విసిరి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి అనాగరికమైన దాడిగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భావిస్తున్నది. ఈ దాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతి కు గురి చేసింది.చీప్ జస్టిస్ మీద దాడి ప్రజాస్వామిక స్ఫూర్తి, రాజ్యాంగం మీద జరిగిన దాడి గానే ఉన్నది. ఈ మధ్యకాలంలో రాజ్యాంగం స్ఫూర్తి ని ఎత్తి పట్టే ప్రధాన న్యాయమూర్తి లో ఒకరు గా పేరు గాంచిన బీ ఆర్ గావాయ్ చీప్ జస్టిస్ కావడం ఆధిపత్య శక్తులకు జీర్ణించుకోలేక పోవడం,అందుకే అహంకారికా పూరితంగా భావించి ఈ దాడి కి తెగ బడ్డారు.అని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి,అంబేద్కర్ యువజన సంఘం, ప్రజా సంఘాలు భావిస్తున్నది కావున తక్షణమే దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్షించాలి అని డిమాండ్ చేస్తూ మాన్యశ్రీ ,పద్మ శ్రీ మందకృష్ణ మాదిగ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఆదేశానుసారము నియోజకవర్గ కేంద్రాలు మరియు మండల కేంద్రాల్లో దళిత ఆత్మగౌరవ నిరసన కార్యక్రమాల్లో భాగంగా మక్తల్ మండల తహసిల్దార్ కి వినతిపత్రం అందివ్వడం జరిగింది.దాడి చేసిన వ్యక్తిని చట్టపరంగా శిక్షించి తక్షణమే అరెస్టు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా సుప్రీంకోర్టు పరిధిలో చర్యలకు ఉపక్రమించి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తగు బాధ్యత వహించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ వినతి పత్రం అందించే కార్యక్రమంలో పాల్గొన్నవారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మక్తల్ పట్టణ అధ్యక్షులు జ్ఞాన ప్రకాష్ మాదిగ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మక్తల్ మండల ఇన్చార్జి హెచ్ వెంకటేష్ మాదిగ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మక్తల్ మండల కోశాధికారి జగ్గలిఅంజప్ప మాదిగ,మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సభ్యులు చంద్ర శేఖర్ నర్సిరెడ్డి పల్లి గ్రామ అధ్యక్షుడు.మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి క్రియాశీల కార్యకర్త పేయింటర్ అంజి.ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జీ పి పి రాములు.
అంబేద్కర్ యువజన సంఘం మాజీ అధ్యక్షులు జె.నర్సిములు.బి కృష్ణయ్య కర్ని గ్రామ ఇంచార్జ్.ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు జుట్ల లక్ష్మన్ (మాజీ హైదరాబాద్ పట్టణ ఏరియా) అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తల్వార్ నరేష్ మాదిగ.తదితరులు పాల్గొన్నారు.
