

అధ్యక్ష,కార్యదర్శులుగా బల్లా ఓబులేష్,కాల శివరాజ్ ఎన్నిక
అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 21} అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గం ఆద్వర్యమలో ఉజ్జెల్లి గ్రామ ప్రజలు నూతనంగా అంబేద్కర్ యువజన సంఘం కమిటిను ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ మక్తల్ నియోజకవర్గ కేంద్రంగా గత 45 సంవత్సరాల క్రితం ఏర్పడిన అంబేద్కర్ యువజన సంఘం మహాత్మ జ్యోతిబాపూలే,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో గ్రామాల్లో అగ్రవర్ణాలు దళిత,బడుగు,బలహీన వర్గాల పట్ల కొనసాగించే అసమానతలను, అంటరానితనాన్ని,సామాజిక వివక్షతను నిర్మూలించుటకై కృషిచేస్తూ గ్రామాల్లోనీ ప్రజలను సంఘాలుగా చేసి పోరాడే చైతన్యాన్ని అందిస్తూ ముందుకెళ్తున్నదనీ ఆ దారిలోనే నూతనంగా ఎన్నికైన ఉజ్జెల్లి అంబేద్కర్ యువజన సంఘం కమిటీ కూడా పనిచేయాలన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగం సామాజిక సేవా దృక్పథంతో ప్రజలందరికీ ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా విద్య,వైద్య రంగాలను అందుబాటులో ఉంచాలని చెపుతున్నప్పటికీ నేటికి చాలా గ్రామాల్లోనీ ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేకుండానే నడుపుతూ ప్రతి సంవత్సరం పిల్లలు రావటం లేదనే నెపంతో వేల పాఠశాలలను ఎత్తేసి,కార్పొరేట్ విద్యను ప్రోత్సహించి దళిత,బహుజన వర్గాలను విద్యకు దూరం చేస్తున్న తీరుపై మరియు గ్రామంలోని ఇతర సమస్యలపై దృష్టి పెట్టీ సంబంధిత అధికారులను,ప్రభుత్వాలను ప్రశ్నించి,ఆయా సమస్యలు పరిష్కారమయ్యేలా గ్రామ ప్రజలకు ఉజ్జేలి అంబేద్కర్ యువజన సంఘం నాయకత్వం వహించాలన్నారు. అదేవిధంగా దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల గడిచిన కులోన్మాధులు నేటికి దళితులను ఆలయాల ప్రవేశాలకు నిరాకరించటం,వారిపై పరువు హత్యలు వంటి అమానుష దాడులు చేస్తూ వారి హక్కులను కాల రాస్తున్నారు.వేల సంవత్సరాల నాటి అణిచివేత అమలయ్యేలా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు పాల్పడుతున్న బిజెపి మతోన్మాద రాజకీయాలను వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకునే రాజకీయ శక్తిగా ఎదిగేలా గ్రామలోని దళిత బహుజనులను మహాత్మ పూలే అంబేద్కర్ లాంటి వారి స్పూర్తితో చైతన్యవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్విరాజ్ సహాయ కార్యదర్శి రవికుమార్ మానవ హక్కుల కార్యకర్త మద్దిలేటి,అంబేద్కర్ యువజన సంఘం క్రియాశీలక సభ్యులు తల్వార్ నరేష్, రవికుమార్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు సురేష్, అక్షయ్ ఉజ్జల్లి అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీ మరియు కార్యవర్గం తదితరులు పాల్గొన్నారు.