రోడ్డు ప్రమాద బాధిత యువకుడికి మంత్రి వాసంశెట్టి సుభాష్ అండ

July 21, 2026 | సినిమా వార్తలు

చికిత్స కోసం రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేత


పయనించే సూర్యుడు జూలై 21 ముమ్మిడివరం ప్రతినిధి( గ్రంధి నానాజీ)రామచంద్రపురం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న యువకుడికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.వివరాల్లోకి వెళితే, రామచంద్రపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం గ్రామానికి చెందిన కైరం సూర్య దుర్గ నాగ ధనరాజ్ (23) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తలకు బలమైన దెబ్బ తగలడంతో చికిత్స పొందుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన సూర్య పరిస్థితిని స్థానిక నాయకులు మంత్రి వాసంశెట్టి సుభాష్ దృష్టికి తీసుకెళ్లారు.విషయం తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, సూర్య వైద్య చికిత్స కోసం తన వంతు సహాయంగా రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మంత్రి సుభాష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఆదుకుని అండగా నిలిచిన మంత్రి సుభాష్ మానవతా గుణాన్ని స్థానికులు, గ్రామస్థులు ప్రశంసించారు.ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అనే భావనతో మంత్రి సుభాష్ చేస్తున్న సేవలు ప్రజల్లో మరింత విశ్వాసాన్ని పెంచుతున్నాయని పలువురు పేర్కొన్నారు. మంత్రి సుభాష్ వెంట ఏఎంసి చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్,కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper