
పయనించే సూర్యుడు న్యూస్( అక్టోబర్.22/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
జిల్లా కలెక్టర్ , ఎస్పీ ఆదేశాల మేరకు, పుత్తూరు డిఎస్పి పర్యవేక్షణలో, సత్యవేడు సీఐ మురళి నాయుడు ఆధ్వర్యంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని, మండలంలోని ఇతర శాఖలతో కలిసి మండలంలో పర్యవేక్షిస్తున్నామని… వర్షం ఇదే స్థాయిలో పడితే ముంపుకు గురయ్యే గ్రామాలు, జలదిగ్బంధనానికి గురయ్యే గ్రామాల లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని, ప్రధాన రహదారుల పై వంతెనల వద్ద పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు హాని కలవకుండా నిఘా పెట్టామని… తెలుపుతూ.మరోవైపు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పూర్తిగా నిండిన చెరువులు, వాగులు, వంకలు, గుంటల వద్ద స్నానాలకు, చేపల వేటకు, వెళ్లకూడదని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు కూడా చేయరాదని, వంతె వంతెనల వద్దన వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రమాదవ స్థాయిలో నీరు ప్రవహిస్తుంటే దాటి సాహసం చేయకూడదని, మరి ముఖ్యంగా వృద్ధులువృద్ధులు, మహిళలు, పిల్లలు మహిళలు పిల్లలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారుఏది ఏమైనా అధికారులు కూడా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సత్యవేడు నియోజకవర్గంలో పడుతున్న విస్తార వర్షాలకు మరింత అప్రమత్తమై ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఉన్న మండలాలైన వరదయ్యపాలెం, కె వి బి పురం మండలాలలో అధికారులు మరింత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా… వుంది.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల పై ప్రవహించే వాగులు, వంకలపై అధికారులు నిఘా పెట్టాలి… ప్రజలు దాటేటప్పుడు ఏ ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది, మరోవైపు పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్న చెరువులపై ఇరిగేషన్ శాఖ దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది… అదేవిధంగా పడుతున్న వర్షాలకు నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది ప్రజల ఆరోగ్య రీత్యా ఆరోగ్యశాఖ అధికారులు కూడా ప్రజలకు తగు ఆరోగ్య జాగ్రత్తలు సూచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది…