రుద్రూర్, అక్టోబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి రుద్రూర్ మండల కేంద్రంలోని ఆర్ఎన్ సి కాలనీలో బుడ్డోల్ల బాబి – గంగారాం (డ్రైవర్) అను వ్యక్తి ఇల్లు కూలింది. వర్షం కురవడంతో ఇంటి పై కప్పు కూలి కిందపడింది. ఇల్లు కూలడంతో పెను ప్రమాదం తప్పిందని కుటుంబీకులు ఊపిరిపీల్చుకున్నారు. బాబి అను వ్యక్తి వెల్డింగ్ దుకాణంలో పని చేస్తు జీవనం కొనసాగిస్తున్నాడు. అధికారులు, నాయకులు స్పందించి ఆదుకోవాలని కోరారు.

