రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన యాడికి విజన్ హై స్కూల్ విద్యార్థిని.
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి విజన్ స్కూల్లో చదువుతున్న తృషిత, బుధవారం అనంతపురంలో జరిగిన డివిజనల్ స్థాయి టీం లన్ని కలిసి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొన్నాయి. గుంతకల్ డివిజన్ తరఫున యాడికి విజన్ హై స్కూల్ విద్యార్థి తృషిత అద్భుతంగా ఆడి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎన్నిక కావడం జరిగింది . మొదటి మ్యాచ్ లో గుంతకల్ డివిజన్ ధర్మవరం జట్టుపై గెలుపొంది, రెండవ మ్యాచ్ లో పుట్టపర్తి జట్టుపై గెలుపొంది ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో పెనుగొండ జట్టుతో తలపడిన గుంతకల్ డివిజన్ జట్టు అద్భుత పోరాట పటిమ ను ప్రదర్శించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడం జరిగింది. రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక కాబడిన వాలీబాల్ క్రీడాకారులు ఈ నెల 27 నుండి 29 వరకు పశ్చిమ గోదావరిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు అనంతపురం జిల్లా జట్టు తరఫున పాల్గొనడం జరుగుతుంది. తృషిత స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావడంతో విజన్ ఉపాధ్యాయ బృందం మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.
