పోషక ఆహార మాస వారోత్సవాల్లో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ్ మా ప్రోగ్రాంలో భాగంగా బుధవారం ఇల్లందు మార్కెట్ యార్డ్ నందు ప్రాజెక్ట్ లెవెల్ ఆఫీసర్ సిడిపిఓ డాక్టర్ కె అరుణ కుమారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని మాట్లాడుతూ.. పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తుందని అన్నారు నియోజకవర్గంలో సొంత భవనాలు లేని అంగన్వాడి కేంద్రాలకు నిధులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నారులకు అన్న ప్రసన్న మరియు అక్షరాభ్యాసం ఎమ్మెల్యే చేశారు తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాల ప్రదర్శనను ఆయన సందర్శించారు, ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు రాంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎదలపల్లి అనసూయ, మాజీ సర్పంచులు పాయం లలిత, పాయం స్వాతి, కల్తీ పద్మ, ఎంఈఓ ఉమా శంకర్, మెప్మా కోఆర్డినేటర్ నాగయ్య, డిడబ్ల్యుఓ స్వర్ణలత, సిడిపిఓ అరుణకుమారి, ఏసీడీపీవోలు విజయ కుమారి, అర్చన, పోషణ అభియాన్ బిసి హిందూ, సూపర్వైజర్స్, ఏ డబ్ల్యుటిఎస్, ఏ డబ్ల్యు హెచ్ ఎస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, ప్రజలు పాల్గొన్నారు.