భీంగల్ పట్టణంలో 9వార్డు ప్రజలకు జల శక్తి అభియాన్ జాన్ భగీదారి పై అవగాహన .
పయనించే సూర్యుడుD.22.7.2026 నిజామాబాద్ జిల్లా టీకే గంగాధర్.బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మండలం
పురపాలక సంఘం -భీంగల్ కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం CDMA ఆదేశాల మేరకు ఈరోజు బుధవారం రోజున భీంగల్ పట్టణంలోని 9 వ వార్డ్ ప్రజలకు “జల శక్తి అభియాన్ – జన భాగీ దారి “JSJB -3.0 లో భాగంగా *క్యాచ్ ది రైన్ * అవగాహన కార్యక్రమం లో భాగంగా నీటి సంరక్షణ సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా చెత్తను వేరుచేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని, వర్షాకాలం దృశ్య సీజనల్ వ్యాధులు రాకుండా దోమలకు కారణమైన ఇంటిలోని నిలువ నీటిని తొలగించాలని చెప్పడం జరిగింది.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గజానంద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటి వద్ద ఇంకుడు గుంతలను నిర్మించి భూగర్భ జలాలను పెంచడంలో తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బోదిరే నాగమణి స్వామి , వైస్ చైర్ పర్సన్ సంటి లతా నర్సయ్య 9వ వార్డ్ కౌన్సిలర్ నీలం రవి మెప్మా సిబ్బంది వార్డ్ ప్రజలు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.