
- భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ …
రుద్రూర్, అక్టోబర్ 23 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రైతులు పండించిన పంటకు రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా తరుగు పేరుతో నిలువునా దోచుకుంటున్నారని, రైతులు ఎండనకవాననక రైతు తాము పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని సంతోషించాలో, అధిక తరుగుతో మోసం చేస్తున్న రైస్ మిల్లర్లను పట్టించుకోని అధికారులను చూసి రైతులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ ఆరోపించారు. రైస్ మిల్లర్లు ట్రక్ షీట్లు ఇవ్వక అసలు తరుగు ఎండ పెడుతున్నారన్నది ఎవరికి అర్ధం కావడంలేదని నిస్సాహయక స్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. అకాల వర్షాల పట్ల రైతులు నిండా మునిగి చేతికొచ్చిన పంటకు కూడా తరుగు పేరుతో చేస్తున్న రైస్ మిల్లర్లు 40 కిలోల 500 గ్రాములు కాటా నిర్ణయించారని, మిల్లర్లు మంగళవారం వరకు 41 కేజీ, బుధవారం 41 జీ 100 గ్రాములు తరుగుతో ఉంటేనే రైస్ మిల్లర్లు తీసుకుంటానని చెప్పడం విశేషం. రైస్ మిల్లర్లు అదేశిస్తే అధికారులు ఖండించక పోగా, వారికి వత్తాసు పలుకుతున్నట్లుగా అధికారుల వ్యవహార శైలి మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు రోజుకు అరకిలో చొప్పున వాతావరణ పరిస్థితుల దృష్టా ఇదే అదునుగా చేసుకుని రైతులను తరుగు పేరుతో మోసం చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.