వేదం ఒలింపియాడ్ విద్యాసంస్థపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలి: (సి వై ఎస్ ఎస్), (యూఎస్ఎఫ్ఐ) నాయకులు*నిర్మల్ :

July 22, 2026 | సినిమా వార్తలు

భైంసా పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న ‘వేదం ఒలింపియాడ్’ విద్యాసంస్థపై సమగ్ర విచారణ జరిపి, ఉల్లంఘనలకు పాల్పడిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సి వై ఎస్ ఎస్, యూఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు (సి వై ఎస్ ఎస్) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్, (యు ఎస్ ఎఫ్ ఐ)జిల్లా కార్యదర్శి నామత్కర్ నవీన్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారికి (డిఇఓ) భోజన్న కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వేదం ఒలింపియాడ్ విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, కనీస గుర్తింపు, అగ్నిమాపక శాఖ అనుమతులు, భవన భద్రతా ధృవపత్రాలు లేకుండానే తరగతులు నిర్వహిస్తోందని ఆరోపించారు. విద్యార్థుల భద్రతకు సంబంధించిన కనీస ప్రాథమిక ప్రమాణాలు పాటించకుండా పాఠశాలను నడపడం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.సంబంధిత అధికారుల నుండి చట్టబద్ధమైన అనుమతులు పొందకుండానే “కేంబ్రిడ్జ్”, “ఒలింపియాడ్”, “ఎక్సలెన్స్”, ” లాంటి ఆకర్షణీయమైన పదాలను వాడుతూ తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల వివరాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించకుండా, ఇష్టానుసారంగా భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ పేద, మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.డిమాండ్లు:జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే సదరు పాఠశాలను తనిఖీ చేయాలి. అనుమతులు, భద్రతా ప్రమాణాలు, పారిశుద్ధ్యం మరియు ఫీజుల వసూళ్లపై సమగ్ర విచారణ జరపాలి. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే యాజమాన్యంపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.నిబంధనలు పూర్తిగా అమలయ్యే వరకు సదరు విద్యాసంస్థ కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలి.విద్యార్థుల భవిష్యత్తు, విద్యా రంగంలో పారదర్శకత మరియు తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసమే తాము ఈ ఫిర్యాదు చేశామని, విద్యాశాఖ అధికారులు దీనిని అత్యవసర అంశంగా పరిగణించి తక్షణమే చర్యలు చేపట్టాలని నాయలు విజ్ఞప్తి చేశారు.ఇట్లు,శీతల్కర్ అరవింద్(, సి వై ఎస్ ఎస్) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నామత్కర్ నవీన్,( యు ఎస్ ఎఫ్ ఐ) జిల్లా కార్యదర్శి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper