
పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు : అక్టోబర్ 21న ప్రపంచ ఐయోడిన్ లోప వ్యాధుల నివారణ దినోత్సవం సందర్భంగా ఏన్కూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని డాక్టర్ రాములు ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా డాక్టర్ రాములు మాట్లాడుతూ, ఐయోడిన్ మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజమని, ఇది థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయడానికి చాలా అవసరమని తెలిపారు. ఐయోడిన్ లోపం వల్ల గర్భస్రావాలు, మృత శిశువులు, జన్యు లోపాలు, ప్రసవ సమీపంలో శిశు మరణాలు, క్రెటినిజం, హైపోథైరాయిడిజం, గొయిటర్ (గొంతు ఉబ్బరం), మానసిక సామర్థ్యం తగ్గడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.ప్రజలు ఐయోడిన్ లోప వ్యాధులను నివారించాలంటే కేవలం ఐయోడైజ్డ్ ఉప్పు మాత్రమే వినియోగించాలి అని సూచించారు. అలాగే ఉప్పులోని ఐయోడిన్ ఆవిరైపోకుండా ఉండేందుకు ఉప్పును ఎయిర్‌టైట్ (గాలి చొరబడని) డబ్బాలో భద్రపరచాలి అని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆషా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
