చింతూరు డివిజన్లోని ఎల్ టి ఆర్ కేసు సమస్యలకు సంబంధించి ఐ టి డి ఏ నందు ఎల్ టి ఆర్ సెల్ ఏర్పాటు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ ఇంచార్జ్ అక్టోబర్ 25 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండలం లశ్రీ శుభం నోక్వాల్, IAS, ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు చింతూరు డివిజన్ లోని LTR సమస్యలకు సంబంధించి సోమవారం నుండి ఐటిడిఎ చింతూరు నందు LTR సెల్ ను నెల రోజుల వరకు ఏర్పాటు చేయటం జరుగుతుంది అని ఈ సెల్ నందు జె. విలెంటన్ బాబు, 9014677374, డిప్యూటీ తహశీల్దార్, ట్రైబల్ వెల్ఫేర్ కోర్టు, రంపచోడవరం వారిని ఐటిడిఏ చింతూరు పరిధిలో ఉన్న LTR పిర్యాదుల స్వీకరించడానికి నెల రోజుల వరకు నియమించడం జరిగినది మరియు ప్రతి బుధవారం PGRS నందు ట్రైబల్ వెల్ఫేర్ కోర్టు రంపచోడవరం కు సంబంధించిన స్పెషల్ డిప్యూటీ కలెక్టరు వారు హాజరు అవటం జరుగుతుంది అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు తెలిపినారు.