పయనించే సూర్యుడు అక్టోబర్ 25( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఈనెల 27 న ఏ టి ఎస్ సెంటర్లకు వ్యతిరేకంగా ఆత్మకూరులో ఆటో కార్మిక యూనియన్లు ర్యాలీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు లో 27 తేదీన సోమవారం ఉదయం 10 గంటలకు మున్సిపల్ బస్టాండ్ నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రవాణా సంస్థ పై జీవనం సాగిస్తున్న ఆటో కార్మికులను బానిసలుగా చేస్తూ తెచ్చిన రవాణా చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఈ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ఏ టి ఎస్ సెంటర్ల వలన దళారులు. బ్రోకర్ వ్యవస్థ ఏర్పడింది. వీటివలన ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున వీటిని వెంటనే రద్దు చేయాలని ఆటో యూనియన్లు డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించాలని సిఐటియు మండల అధ్యక్షుడు ఆత్మకూరు నాగయ్య, మండల కార్యదర్శి మహేష్ పిలుపునిచ్చారు. ఆటో కార్మికులు అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ధర్నాను జయప్రదం చేయాలని యూనియన్ నాయకులు కోరారు.

