పయనించే సూర్యుడు అక్టోబర్ 25,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
గడివేముల పశువైద్యశాలలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సాయి హరిణి ఉచిత గర్భకోశ శిక్షణా శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉపసంచారకులు డా.శ్రీనివాసరావు, నంద్యాల డివిజన్ పశుగణాభివృద్ధి సంస్థ ఉపసంచారకులు డా.రాజశేఖర్,సహాయసంచారకులు డా. కమలాకర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 40 మంది రైతులకు చెందిన 10 ఆవులకు, 36 గేదెలకు పరీక్షలు నిర్వహించి,23 లేగదూడలకు నట్టల నివారణ మందులు తాపించి,16 పశువులకు సాధారణ కేసులకు పరీక్ష నిర్వహించారు.పశువులకు వచ్చే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పశువైద్యాధికారులను పాడి పశువుల రైతులు సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాలని పశు రైతులకు సలహాలు సూచనలు ఇచ్చారు. లింగ నిర్ధారణ వీర్యం 50% సబ్సిడీతో అందుబాటులో ఉంటుందని వీటి ద్వారా 90% పై దూడలు పుట్టే అవకాశం ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని పాడి పశువుల రైతులు సద్వినియోగం చేసుకోవాలని పశువైద్యాధికారిని డాక్టర్ సాయి హరిణి కోరారు.

