Tuesday, October 28, 2025
Homeఆంధ్రప్రదేశ్వైద్య సిబ్బందికి మెడిటేషన్ పై అవగాహన సదస్సు

వైద్య సిబ్బందికి మెడిటేషన్ పై అవగాహన సదస్సు

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు )

టేకులపల్లి: సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో శ్రీ రామచంద్ర మిషన్ వారు వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలకు మెడిటేషన్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ మాట్లాడుతూ మనస్సు శరీరం ఆలోచనలు శ్వాస వీటన్నిటిని ఒకచోట కేంద్రీకరించి ఉంచే ప్రక్రియను ధ్యానం లేదా మెడిటేషన్ అంటారు అని, మన జీవితం ఆరోగ్యకరంగా ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా మన జీవితం చివరిదాకా సాఫీగా సాగడానికి ధ్యానం*ఎంతగానో ఉపయోగపడుతుంది అని,మనం వైద్య ఆరోగ్యశాఖలో ఉన్నాము కాబట్టి ముఖ్యంగా మనకు శారీరకంగా మరియు మానసికంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండడం ఎంతో ముఖ్యమని అలా కలిగి ఉన్నవారు చాలా చాలా అదృష్టవంతులు అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన శ్రీ రామచంద్ర మిషన్ హాట్ ఫుల్ నెస్ యోగా శిక్షకురాలు శ్రీమతి మాధురి మాట్లాడుతూ వైద్య సిబ్బందితోపాటు గర్భిణీ స్త్రీలకు పిల్ల తల్లులకు గృహిణులకు మానసిక ప్రశాంతత ఒత్తిడి నియంత్రణ మరియు సానుకూల ఆలోచనల అభివృద్ధి కొరకు ప్రభుత్వం వైద్య సిబ్బందికి మరియు ఆశా కార్యకర్తలకు ధ్యానం పై అవగాహన కల్పించడం జరుగుతుందని ధ్యానం చేయడం ద్వారా మనసు స్థిరంగా ఉండడంతోపాటు ఆరోగ్యకరమైన గర్భధారణకు సహాయపడే ఆలోచన విధానం మరియు వైద్య సేవల్లో సానుభూతి భావం పెంపొందించడం వంటి ప్రయోజనాలు అందించే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది అని శ్రీమతి మాధురి అన్నారు. మళ్లీ వచ్చే ఆషాడే రోజు నవంబర్ 4వ తారీఖు మంగళవారం రోజున ధ్యానంపై వైద్య సిబ్బందికి ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఉంటుంది అని ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు పెట్టినప్పుడు మీరు ఉత్సాహంగా నేర్చుకొని మీరు స్వయంగా పాటించి ప్రజల చేత కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు పాటింపజేసేటట్లు చేసి ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించడంలో సహకరించాలని అభ్యర్థించారుఈకార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వజ్జా పార్వతి,పబ్లిక్ హెల్త్ నర్స్ ఆఫీసర్ చంద్రకళ,ఆరోగ్య విస్తరణా అధికారి దేవ, సూపర్వైజర్లు గుజ్జ విజయ,కౌసల్య సింగ్,పోరండ్ల శ్రీనివాస్ నాగు బండి వెంకటేశ్వర్లు, నర్సింగ్ ఆఫీసర్ జగదాంబ, కిరణ్ కుమారి రజిత విజయ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments