Tuesday, October 28, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

Listen to this article

రోడ్లు రవాణా మార్గమా? ప్రమాద మార్గమా?

ఆర్ అండ్ బి అధికారుల పనితీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే ఉంది

ఏన్కూరు మండలంలో ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారా లేరా అనే సందేహాలు మండల ప్రజలకు వస్తున్నాయి

నెల జీతాలు కే పరిమితమైన ఆర్ అండ్ బి అధికారులు

కాంట్రాక్టర్ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి నాసిరకపు రోడ్లను నిర్మిస్తున్న పట్టించుకోని ఆర్ అండ్ బి ప్రభుత్వ యంత్రాంగం

ఆర్ అండ్ బి అధికారుల పనితీరు ఎప్పుడు మారుతుందో అని మండల ప్రజలు వేచి చూడాల్సిందేనా

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూర్ మండలం పరిధిలోని ప్రధాన రహదారులు రవాణా మార్గాలకంటే ప్రమాద మార్గాలుగా మారిపోయాయి. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి ప్రజల ప్రాణాలు బలైపోతున్నాయి. ఏన్కూర్–ముచ్చర్ల, ఏనుకూరు–కొత్తగూడెం రహదారులతో పాటు అక్కినపురం తండా రహదారి కూడా ప్రమాదకర స్థితిలో ఉంది.
వర్షాకాలం వచ్చిందంటే ఈ రోడ్లపై ప్రయాణం చేయడం అంటే ప్రాణాలతో ఆటలాడటమే. గుంతలు, పగుళ్లు, నీటి నిల్వలతో నిండిన ఈ రోడ్లపై వాహనదారులు ప్రాణాలు పణంగా పెట్టి ప్రయాణం చేస్తున్నారు.ఏన్కూర్–ముచ్చర్ల రహదారి : ప్రాణాలకు ముప్పు ఏన్కూర్ నుంచి ముచ్చర్లకు వెళ్లే ప్రధాన రహదారి దశాబ్దాల నాటి రహదారిలా మారిపోయింది. పెద్ద గుంతలు, ఎత్తుపల్లాలు, కూలిపోతున్న అంచులు వాహనదారులను రోజూ ప్రమాదంలోకి నెడుతున్నాయి. రాత్రివేళల్లో గుంతలు కనిపించక వాహనాలు బోల్తా కొట్టే ఘటనలు పెరుగుతున్నాయి.ఎన్ని సార్లు అధికారులు వస్తే ఫోటోలు తీస్తారు కానీ పనులు మొదలు పెట్టరు. రోడ్డంతా చిత్తడిగా మారింది. ఈ రహదారిపై ప్రతీ వారం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అని వాహనదారులు వాపోతున్నారు.ఏన్కూరు –కొత్తగూడెం రహదారి : ప్రజల ఆవేదన, రవాణా కష్టాలు ఏన్కూరు నుంచి కొత్తగూడెం రహదారి మండలానికి ప్రధాన రవాణా దారి అయినప్పటికీ దాని పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్డు ఎక్కడ చూసినా గుంతలే కనబడుతున్నాయి.ఇటీవలే ఒక యువకుడు బైక్‌పై వెళ్తుండగా గుంతను గుర్తించలేక అదుపుతప్పి రోడ్డు పక్కన పడిపోయి మృతి చెందాడు. ఈ ఘటనతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పంటల బస్తాలు తీసుకుని మార్కెట్‌కి వెళ్లడం అంటే ప్రాణం పణంగా పెట్టడం లాంటిదే. వర్షం పడితే వాహనాలు మట్టిలో ఇరుక్కుపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాత్రివేళల్లో వాహనాలు నడపడం అంటే ఆత్మహత్యతో సమానం అని డ్రైవర్లు చెబుతున్నారు. లైట్లు ఉన్నా గుంతలు కనబడడం లేదు.పోలీసులు, అధికారులు ప్రదేశాన్ని సందర్శించి తాత్కాలికంగా మట్టి వేసినా, కొన్ని రోజుల్లోనే గుంతలు మళ్లీ బయటపడ్డాయి.ఇటీవలే స్థానిక ఎస్సై సంధ్య స్వయంగా రోడ్లను పరిశీలించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు, కానీ వర్షాలు మొదలైన వెంటనే రోడ్లు మళ్లీ పాడైపోయాయి. ఈ రోడ్ల దారుణ పరిస్థితి వాహనదారులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగిస్తోంది.గార్లఒడ్డు యువకుడు మృతి – నిర్లక్ష్యానికి బలి
ఇటీవలి ఘటనలో ఏన్కూర్ మండల పరిధిలోని గార్లఒడ్డు గ్రామానికి చెందిన యువకుడు, రాత్రివేళ గుంతలు కనబడక బైక్ అదుపుతప్పి కార్ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ప్రజల్లో తీవ్ర ఆవేదన రేపింది.రహదారులు సరిగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. వాహనదారులు చీకట్లో ప్రాణాలతో ప్రయాణిస్తున్నారు. ఇంకెంతమంది బలవ్వాలి?” అని ప్రశ్నిస్తున్నారు.గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ — “ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించిన రోడ్లు కొన్ని నెలల్లోనే కూలిపోతే అది నాణ్యత లేని పనుల ఫలితం. అలాంటి కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్ చేయాలి. కొత్తగా పునర్నిర్మాణం జరిగే వరకు తాత్కాలికంగా అయినా సురక్షిత మార్గం కల్పించాలి” అని డిమాండ్ చేస్తున్నారు.ఇకనైనా అధికారులు మేల్కొని శాశ్వత మరమ్మతులు చేపట్టాలి. రోడ్లు సరిచేస్తే ప్రాణాలు కాపాడినట్టే. లేదంటే మరో అమాయకుడు బలవ్వాల్సిందే.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments