- మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు (పయనించే సూర్యుడు అక్టోబర్ 27 రాజేష్)
- దౌల్తాబాద్, అక్టోబర్ 27: రైతులు తమ పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని హైమద్ నగర్ తిరుమల కాటన్ మిల్లులో సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళారులను ఆశ్రయించకుండా సిసిఐ వద్ద మాత్రమే పత్తి అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పత్తిలో తేమశాతం పరీక్షించే పరికరాలు అందుబాటులో ఉంచాలని, మార్కెట్ యార్డులలో సరిపడా యంత్రాలు, పరికరాలు, సిబ్బంది ఉండేలా చూడాలన్నారు. సి సి ఐ ప్రవేశపెట్టిన మ్యాపింగ్ విధానంతో రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను కోరారు. అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాన్ని పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ సెక్రటరీ సుగ్రీవ్, తహసిల్దార్ చంద్రశేఖర రావు బిజెపి మండల అధ్యక్షులు లావణ్య నరసింహారెడ్డి నాయకులు కిషన్ భూపాల్ రెడ్డి స్వామి గౌడ్ స్వామి లక్ష్మణ్ గణేష్ ముత్యాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

