వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయకకు వినతి పత్రం అందజేత
పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూర్ మండల పరిధిలోని భద్రుతండ,వినోభానగర్ గ్రామాల రైతులు పంట పొలాలకు వెళ్లేందుకు సరైన రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రుతండ గ్రామం నుండి వినోభానగర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో లింక్ రోడ్డు లేకపోవడంతో వర్షాకాలంలో రాకపోకలు కష్టసాధ్యమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రుతండ పంచాయతీ పరిధిలోని 50 మంది రైతులు, వినోభానగర్ గ్రామానికి చెందిన 40 మంది రైతులు కలిపి సుమారు 450 ఎకరాల భూమిని సాగు చేస్తున్నప్పటికీ రహదారి లేక ఎరువులు, విత్తనాలు, కూరగాయల రవాణాలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు, స్థానిక ప్రజలు వైరా క్యాంపు ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ను కలిసి భద్రుతండ,వినోభానగర్ లింక్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధి దిశగా ఈ రహదారి నిర్మాణం అత్యవసరమని రైతులు కోరారు. ఈ సందర్భంగా గుగులోత్ బగ్గు నాయక్, మొగిలి నాగరాజు, బాదావత్ సేవ్యతో పాటు రెండు గ్రామాల రైతులు, స్థానికులు పాల్గొన్నారు.

