PS Telugu News
Epaper

వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేత..

📅 29 Oct 2025 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

రుద్రూర్, అక్టోబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

పోలీసు అమరవీరుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా రుద్రూర్ పోలీస్ ఆధ్వర్యంలో రుద్రూర్ మండల కేంద్రంలోని ఫుడ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు రుద్రూర్ ఎస్సై సాయన్న చేతుల మీదుగా బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపి శ్రీనివాస్,రుద్రూర్ సీఐ కృష్ణ, ఫుడ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, క్రీడాకారులు, కళాశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top