వర్షాల నేపథ్యంలో వరి కోతలను రెండు రోజులు వాయిదా వేసుకోవాలి అని సూచన.
వర్షం తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలి అని సూచించారు.
జిల్లెల్ల గ్రామంలోని ప్యాక్స్ కొనుగోలు కేంద్రం పరిశీలన చేశారు.
ధాన్యం కుప్పలు, వడ్ల తేమ శాతం పరిశీలించారు, రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
పయనించే సూర్యుడు, అక్టోబర్ 30( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలోని ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు టార్పాలిన్లు తప్పనిసరిగా అందజేయాలని అధికారులను ఆదేశించారు.
వర్షాల ప్రభావం దృష్ట్యా రైతులు వరి కోతలను మరో రెండు రోజులు వాయిదా వేసుకోవాలని సూచించారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత ధాన్యం ఆరబెట్టాలని సూచిస్తూ, సన్నరకం వడ్లను కూడా మిల్లర్లు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ధాన్యం కుప్పలు, తేమ శాతం పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్, రైతులు ఆందోళన చెందవద్దని ఆశ్వాసన ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, పౌర సరఫరాల శాఖ అధికారి చంద్ర ప్రకాశ్, తహసీల్దార్ జయంత్ తదితరులు పాల్గొన్నారు.


