భైంసా పట్టణంలో పలు దుకాణాలపై మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో :భైంసా పట్టణంలోని పలు దుకాణాలలో గురువారం రోజున మున్సిపల్ కమిషనర్ ఎం.లింగయ్య సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్ముతున్న, మరియు పలు షాపులలో వాడుతున్న వ్యాపారులకు జరిమానాలు విధించారు పరిసర పరిశుభ్రత పాటించాలని రసాయనాలు ఉపయోగిస్తే కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు అదేవిధంగా బైంసా పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దుతానని కమిషనర్ మాట్లాడారు ఈ తనిఖీల్లో శానిటార్ ఇన్స్పెక్టర్ మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.