పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 30
గురువారం నాడు సంక్షేమ పరిషత్(274/16) కార్యకర్తల సమావేశం రంపచోడవరం మండల కేంద్రంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడు తూ, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలను అమలు చేయడం లో విఫలం అవుతున్నాయని ముఖ్యం గా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటినుండి రాష్ట్రంలో ఆదివాసి చట్టాలకు రక్షణ కరువైందని, హక్కులు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయని, ఎన్నికలకు ముందు జీవో నెంబర్ 3 పై , రంపచోడవరం జిల్లా చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీలను విస్మరించి ఆదివాసులకు ద్రోహం చేయడం జరిగిందని ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రాగానే జీవో నెంబర్ త్రీ కి ప్రత్యామ్నాయంగా చట్టాన్ని తీసుకువచ్చి ఏజెన్సీలో ఉపాధ్యాయ ఉద్యోగాలన్నీ కూడా స్థానిక ఆదివాసులకు ఇస్తానని మాట ఇచ్చి ఆదివాసీలను ముంచారు, అంతేకాక అధికారంలోకి రాగానే ప్రత్యేకంగా రంపచోడవరం జిల్లా ఇస్తానని ఆదివాసులు నమ్మించి ఇప్పుడు ఉన్న ఆదివాసి జిల్లా ( అల్లూరి సీతారామరాజుజిల్లా) ని కూడా లేకుండా చేసే కుట్రలు సాగుతున్నాయి, ఈ విషయాన్ని ఆదివాసీలు తెలుసుకొని ప్రభుత్వ చేస్తున్నటువంటి కుట్రని తిప్పి కొట్టాలని ఆయన ఆదివాసులు పిలుపునిచ్చారు. రంపచోడవరం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో కలిపే కుట్రని తిప్పి కొడతామని, ప్రభుత్వం చేస్తున్న ఈ ఆదివాసి వ్యతిరేక విధానాలకు ఆదివాసులు, ఆదివాసి సంక్షేమ పరిషత్ చూస్తా ఊరుకోదని అయన హెచ్చరించారు. అసలు రంపచోడవరం నియోజకవర్గం యొక్క ఆదివాసి ప్రజల అభిప్రాయ సేకరణ చేయకుండా మంత్రివర్గ ఉప సంఘం తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ఎలా నిర్ణయం తీసుకున్నాదని, ప్రభుత్వం చేతిలో ఉంటే ఏమైనా చేస్తారా? అని ఆయన మండిపడ్డారు. ఆదివాసీ లా పోరాటం ఫలితం గా బ్రిటిష్ పాలకులు ఇచ్చిన ప్రత్యేక ఆదివాసి చట్టాలు, మరియు రాజ్యాంగం ద్వారా ఆదివాసీ లకు వచ్చిన ప్రత్యేక హక్కులు తప్ప ప్రత్యేకంగా ఈ పాలకులు ఆదివాసిల కోసం తెచ్చిన చట్టాలు ఏమున్నాయి అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలేరాసే హక్కు ఈ ప్రభుత్వనికి ఎవరిచ్చారు అని అన్నారు. ఆదివాసులను కేవలం మాయమాటలు చెప్పి ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారు తప్ప ఆదివాసులకు ఉన్న ప్రత్యేక రాజ్యాంగ చట్టాలను అమలు చేయడంలో ఈ పాలకులు విఫలం అవుతున్నారని ఆయన ఆరోపించారు. రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కి ఆదివాసీల సమస్యలు ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు. సరైన వైద్యం అందక ప్రజలు మరణిస్తున్న పట్టించుకోవడం లేదు, ఏజెన్సీ చట్టాల అమలు కాక ఆదివాసులకు హక్కులు దూరం అవుతున్న, ఉద్యోగులు రాకపోయినా పట్టించుకోవడం లేదు, మరోపక్క ఆదివాసి జిల్లా గ ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాని ముక్కలు చేసి అసలు అల్లూరు జిల్లా నే లేకుండా ఏజెన్సీ ప్రాంతాలన్నిటిని అటు పాడేరు డివిజన్ ని ఇటు రంపచోడవరం చింతూరు డివిజన్ ని మైదాన ప్రాంతాల్లో కలిపే కుట్రలు సాగుతున్న ప్రభుత్వంలో ఉన్న ఆదివాసి ప్రజాప్రతినిధులకు ఎందుకు అర్థం కావటం లేదు అని ఆయన ప్రశ్నించారు. ఆదివాసి చట్టాల కన్నా, ఆదివాసి హక్కుల కన్నా పార్టీనే ముఖ్యం అనుకుంటే రాబోయే ఎన్నికల్లో ఎస్టీ రిజర్వేషన్ తో రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసే వారికి తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు. రంపచోడవరం జిల్లా సాధ్యం కానప్పుడు యధావిధిగా అల్లూరి జిల్లాలోని ఉంచాలి గాని కొత్తగా తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని చూడటం దుర్మార్గమైన చర్యని కావున ఆదివాసీల అందరు కూడా ఈ విషయంపై మేల్కొని అల్లూరి జిల్లాను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే నెల 3 తేది సోమవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిరక్షణకై, మరియు రంపచోడవరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలిపే ప్రభుత్వ కుట్రకు తిప్పి కొట్టడానికి ఆదివాసి ప్రజానీకంతో రంపచోడవరం నందు నందు భవిష్యత్ కార్యాచరణ దశలవారి ఉద్యమ కార్యాచరణ కోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఉద్యమ ప్రణాళిక ను పకటించానున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసీలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం లో ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ ప్రధాన కార్యదర్శి చోడి ప్రదీప్ కుమార్ దొర, నాయకులు కలముల ప్రసాద్ దొర, జోగి రాజు, శివ, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

