పయనించే సూర్యుడు అక్టోబర్ 30,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
గురువారం ఉదయం అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నీట మునిగిన పొలాల్లోకి స్వయంగా దిగి నష్ట తీవ్రతను రైతుల నుండి, జిల్లా కలెక్టర్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నుండి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలబడుతుందని, నష్ట తీవ్రతపై ప్రభుత్వం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ పరిశీలనలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ డి.కె బాలాజీ , మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర , మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి , అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ పాల్గొని తుపాను తీవ్రత కారణంగా జరిగిన నష్టాన్ని వివరించారు.

