పయనించే సూర్యుడు అక్టోబర్ 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ల సూచనలతో తీవ్రంగా శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేసిన అధికారులు ఆత్మకూరు నియోజకవర్గం లో గత ఐదు రోజులుగా కురిసిన అధిక వర్షాలకు సంగం బ్యారేజ్ సమీపంలో నిలిపి ఉన్న మూడు బోట్లు వాటి తాళ్లు తెగిపోయి బ్యారేజ్ వైపుకు కొట్టుకుపోయాయి.అలా నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన మూడు బోట్లు బ్యారేజ్ సమీపంలో ఆనకట్ట వద్ద నిలిచిపోవడం జరిగింది. అవి అక్కడినుండి బ్యారేజ్ వైపుకు వెళ్ళితే బ్యారేజ్ కు ప్రమాదం చోటుచేసుకునే అవకాశం ఉందని వీటిని తొలగించమని స్థానిక విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్ల మరియు జిల్లా ఎస్పీ అజిత వెజండ్ల ఇక్కడికి చేరుకొని బోట్లను పరిశీలించి వెంటనే ఇక్కడి నుండి వీటిని తొలగించమని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.దీంతో నిన్న సాయంత్రం నుండి వీటిని తొలగించేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. కృష్ణపట్నం పోర్టు నుంచి ఒక బోటును ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను డివిజన్ పరిధిలోని ఫైర్ మరియు ఇతర సహాయక బృందాలను ఇక్కడికి తరలించారు. ఆత్మకూరు ఆర్డీవో బి పావని, డి.ఎస్.పి కె.వేణుగోపాల్, సోమశిల జలాశయ చైర్మన్ కేశవ చౌదరి స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు రాత్రి నుండి ఈ బోటును తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి ఈరోజు ఉదయం 11 గంటలకు అతి కష్టం మీద ఇరుక్కున్న ప్రాంతం నుంచి బోటును బయటికి తీసీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. అధికారులు మీడియాతో మాట్లాడుతూ మరోసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతామని అన్నారు మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాలతో జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ సూచనలతో డివిజన్ పరిధిలోని డిఎస్పి సీఐలు ఎస్సైలు పూర్తి పోలీస్ సిబ్బంది , ఫైర్ మరియు రెవెన్యూ ఇతర శాఖల సిబ్బంది తీవ్రంగా శ్రమించి ఈ ఆపరేషన్ సక్సెస్ చేయడం పై వీరికి ధన్యవాదాలు తెలుపుతున్నామని ఆర్డిఓ అన్నారు. బ్యారేజ్ కు ఇబ్బంది కలగకుండా ఈ బోట్లను బయటికి తీయడం పై స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకొని అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.


