
పయనించే సూర్యుడు నవంబర్ 1,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల జిల్లా,పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం ఆసుపత్రి నిర్వాహకులు చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రప్రధమంగా ఏర్పాటు చేసిన అలర్జీ, వర్టిగో అత్యాధునిక క్లినిక్ లను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వివిధ రకాల అలర్జీలతో చర్మ, శ్వాసకోశ ఇబ్బందులు పడే వారికి ఏ అలర్జీతో బాధపడుతున్నారో నిర్దిష్టంగా తెలుసుకొని సంబంధిత వైద్యం చేయడానికి తమ అలర్జీ క్లినిక్ లో అత్యాధునిక పరికరాలు, సాంకేతిక నిపుణులు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వర్టిగో అంటే తరచు కళ్ళు తిరగడం, కింద పడిపోవడం వంటి ఇబ్బందులు ఉన్నవారికి వర్టిగో క్లినిక్ లో సంబంధిత కారణాలు తెలుసుకొని దానికి అనుగుణమైన వైద్యం చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు.వర్టిగో క్లినిక్ ను జాతీయస్థాయిలో సేవలు అందిస్తున్న న్యూరో ఈక్విలిబ్రియం సంస్థతో, అలర్జీ క్లినిక్ ను ఏవెక్సియా సంస్థతో కలిసి ఏర్పాటు చేసామన్నారు.వర్టిగో క్లినిక్ లో వర్టిగో స్పెషలిస్ట్ డాక్టర్ అంజు పిల్లై, సాంకేతిక నిపుణులు తపస్వి , అలర్జీ క్లినిక్ లో ప్రబీర్ పట్నాయక్, భాష లు సేవలందిస్తారని తెలిపారు. డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ అలర్జీతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ క్లినిక్ లు నంద్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.ఈ కార్యక్రమంలో నెరవాటి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ గగన్, పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ,ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూధన రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ నెట్ల మహేశ్వరరెడ్డి,మహిళా వైద్యులు డాక్టర్ నర్మద, డాక్టర్ మాధవి, డాక్టర్ హరిత, డాక్టర్ లలిత, డాక్టర్ రాధిక జ్యోతి, డాక్టర్ ఆరీఫా బాను, డాక్టర్ తనూజ అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.