PS Telugu News
Epaper

చైనాకు షాక్: రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ భారత్‌లో తయారీకి సిద్ధం – ప్రధాని మోదీ కీలక నిర్ణయం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్స్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అత్యవసరమైనటువంటి ఈ మినరల్స్ భూమి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని బయటకు వెలికి తీసి రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లయితే, పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో చైనా అగ్రగామిగా ఉంది. చైనా ముఖ్యంగా వీటి ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించి, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారీ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికా సహా భారత్, యూరప్, ఇలా ప్రపంచంలోని పలు దేశాలకు రేర్ ఎర్త్ మాగ్నెట్స్ సరఫరా చేస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా ఒకటే జపం అదే రేర్ ఎర్త్ మాగ్నెట్స్… ఒకప్పుడు పెట్రోలియం ఉత్పత్తులు ఉన్న దేశాలు అత్యంత ధనిక దేశాలుగా భావించేవారు. అలాగే బంగారం నిలువలు, ఇతర ఖనిజనిక్షేపాలు ఉన్న దేశాలను కూడా శక్తివంతమైన దేశాలుగా చూసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మొత్తం మారిపోయింది అదే రేర్ ఎర్త్ మాగ్నెట్స్…వీటిని రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా తయారు చేస్తారు. ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్స్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు అత్యవసరమైనటువంటి ఈ మినరల్స్ భూమి పొరల్లో నిక్షిప్తమై ఉంటాయి. వీటిని బయటకు వెలికి తీసి రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసినట్లయితే, పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తుంది. ప్రస్తుతం ఈ రంగంలో చైనా అగ్రగామిగా ఉంది. చైనా ముఖ్యంగా వీటి ప్రాముఖ్యతను ముందుగానే గుర్తించి, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ తయారీ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికా సహా భారత్, యూరప్, ఇలా ప్రపంచంలోని పలు దేశాలకు రేర్ ఎర్త్ మాగ్నెట్స్ సరఫరా చేస్తోంది. ఇటీవల అమెరికా చైనా మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం వల్ల చైనా ఒక్క సారిగా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సరఫరాను నిలిపివేసింది. దీంతో అమెరికా ఒక మెట్టు దిగి చైనాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. . అలాగే భారత్ కూడా ఈ రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కోసం చైనా పైనే ఆధారపడుతోంది. చైనా ప్రపంచంలో 90% రేర్ ఎర్త్ మాగ్నెట్లను తయారు చేస్తుంది. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే భారత్ కూడా స్వయం సమృద్ధిగా వీటిని తయారు చేసుకున్నట్లయితే, చైనా పైన ఆధారపడటం తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. భారతదేశం చైనాపై ఆధారపడకుండా రేర్ ఎర్త్ మాగ్నెట్ (Rare-Earth Magnet) రంగంలో స్వీయ సామర్థ్యం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం 7000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రణాళిక కోసం కేంద్ర కేబినేట్ ఆమోదం తెలపాల్సి ఉంది.

రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అంటే ఏంటి..? భూమిలో లభించే అరుదైన లోహ మూలకాలను రేర్ ఎర్త్ మినరల్స్ అని పిలుస్తారు. ఇవి మొత్తం 17 మూలకాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. రసాయన శాస్త్రంలోని పీరియాడిక్ టేబుల్ ప్రకారం వీటిని లాంథనైట్స్ అని పిలుస్తారు ఇవి మొత్తం 15 ఉంటాయి. . వీటితో పాటు మరో రెండు మూలకాలు కూడా ఇదే సమూహంలో ఉంటాయి వీటిని స్కాండియం, ఇట్రీయం అని పిలుస్తారు. ఇవి భూమి పొరల్లో చాలా అరుదుగా లభిస్తుంటాయి. వీటిని వెలికి తీసి శుద్ధి చేసి ఉపయోగించడం అనేది చాలా కష్టతరమైన పని. సాధారణంగా బొగ్గు, ఇనుము, క్రూడ్ ఆయిల్ వంటివి ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున లభిస్తాయి. కానీ రేర్ ఎర్త్ మినరల్స్ మాత్రం చాలా తక్కువ మొత్తంలో లభిస్తాయి. వీటిని వెలికి తీసి శుద్ధి చేసి ఉపయోగించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. వీటిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఒక స్ట్రాంగ్ అయస్కాంత తత్వం ఉంటుంది, అలాగే ఇవి అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలవు, అలాగే విద్యుత్ సమర్థవంతంగా ప్రసరించడానికి ఉపయోగపడతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top