PS Telugu News
Epaper

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ సిండ్రోమ్ సమస్యతో బాధపడుతున్నాడు

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :సీనియ‌ర్ యాక్ట‌ర్ రాజ‌శేఖ‌ర్ ఒక‌ప్పుడు యాక్ష‌న్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. వంద‌కు పైగానే సినిమాలు చేశారు. ఇప్పుడు వైవిధ్య‌మైన పాత్ర‌లు చేయ‌టానికి ఆస‌క్తిని చూపిస్తున్నారు. ఇప్పుడు హీరోగా ఆయ‌న మూడు సినిమాల‌ను లైన‌ప్ చేశారు. అందులో ఓ సినిమా శ‌ర్వానంద్ బైక‌ర్‌. ఈ సినిమాలో ఆయ‌న ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపిస్తాడ‌నే టాక్ అయితే గ‌ట్టిగా వినిపిస్తోంది. రీసెంట్‌గా జ‌రిగిన ఈ సినిమా టీజ‌ర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న రాజ‌శేఖ‌ర్ చెప్పిన ఓ విష‌యం అంద‌రికీ షాకింగ్‌గా అనిపించింది. అదేంటంటే.. ఈ సీనియ‌ర్ న‌టుడు ఇరిటేట్ బౌల్ సిండ్రోమ్‌తో బాధ‌ప‌డుతున్నాడు. ఇంత‌కీ ఇరిటేట్ బౌల్ సిండ్రోమ్ అంటే ఏంటో తెలుసా!…స్టేజ్‌పై మాట్లాడాల‌ని పిలిచిన‌ప్పుడు టెన్ష‌న్‌తో క‌డుపులో ఇబ్బంది క‌లుగుతుంది. విరోచ‌నాలు.. మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డ‌తారు. ఉన్న‌ట్లుండి కోపం వ‌చ్చేస్తుంది. ఇదే సిండ్రోమ్ చాలా సంవ‌త్స‌రాలుగా రాజ‌శేఖ‌ర్ బాధ‌ప‌డుతున్నాడు. బైక‌ర్ సినిమా ఈవెంట్‌కు పిలిచిన‌ప్పుడు కూడా ఎక్క‌డైనా ఇబ్బంది క‌లుగుతుందేమోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని కానీ ఏం కాలేద‌ని రాజ‌శేఖ‌ర్ చెప్ప‌టం కొస మెరుపు. శ‌ర్వానంద్ బైక‌ర్ మూవీతో పాటు త‌మిళ చిత్రం ర‌బ్బ‌రు పందు రీమేక్ కోసం రాజ‌శేఖ‌ర్ ప్లానింగ్ చేసుకుంటున్నాడు. మ‌రో వైపు మ‌గాడు అనే టైటిల్‌తో ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమా చేయ‌టానికి కూడా స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు స్క్రిప్ట్ బావుంటే విల‌న్‌గా కూడా చేస్తాన‌ని రాజ‌శేఖ‌ర్ చెప్ప‌టం చూస్తుంటే ఇక‌పై ఆయ‌న‌కు ఎలాంటి సినిమాలు వెళ‌తాయోన‌నే ఆస‌క్తి అంద‌రిలోనూ క‌లుగుతోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top