PS Telugu News
Epaper

అగాపే ఆశ్రమంలో అన్నదానం.

📅 03 Nov 2025 ⏱️ 6:02 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 3 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో కోన ఉప్పలపాడు గ్రామంలో నివాసం ఉంటున్న కార్తీ ఏసన్న, భార్య ఎస్తేరమ్మ కొడుకు ,కూతురు వీరి కుటుంబము ఆశ్రమంలో నిరాశ్రయులకు అన్నదానం ఏర్పాటు చేశారు.ఎంతోమంది పుట్టినరోజు అని, పెళ్లిరోజు అని,వర్ధంతి అని అగాపే ఆశ్రమంలో అన్నదానం చేశారు.అయితే వీరు భిన్నంగా ఆలోచించి వారి ఇల్లు ఓపెనింగ్ చేసి సంవత్సరం అయినందున, వారికి గుర్తుగా ఉండాలని ఆశ్రమంలో ఉన్న వారందరికీ వారి ప్రేమ విందు ఏర్పాటు చేసి కుటుంబమంతా కలిసి భోజనాలు వడ్డించారు.వారితోపాటు కార్తీ లక్ష్మణ్ ఆర్డిటి , బంధుమిత్రులు పాల్గొన్నారు.ఇందు నిమిత్తమై ఆశ్రమ పౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా ఆశీర్వదించి వారి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.

Scroll to Top