
పయనించే సూర్యుడు నవంబర్3 అన్నమయ్య టి సుండుపల్లి మండలం
కడప పట్టణంలో పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని మర్యాద పూర్వకంగా జనసేన పార్టీ సీనియర్ నేత రామా శ్రీనివాస్ కలిశారు. కడప–బెంగళూరు రైల్వే లైన్‌ను రాయచోటి–మదనపల్లి మార్గంలో పునఃప్రారంభించాలని కోరారు. రాయచోటి భౌగోళికంగా జిల్లా కేంద్రంగా కొనసాగాలన్నారు. అలాగే కడప–తిరుపతి జాతీయ రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. రాయచోటి నుండి రాజంపేట మరియు టి. సుండుపల్లి రాయవరం, పించా రోడ్లు అర్దాంతరంగా ఆగిపోవడంతో గుంతలతో నిండి ప్రమాదకరంగా మారాయని తెలిపారు. ప్రజా రవాణా సౌకర్యార్థం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలని జనసేనపార్టీ సీనియర్ నాయకుడు రామ శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.