PS Telugu News
Epaper

“నాయకుడొచ్చాడంటే ప్రజలు ఉప్పొంగారు – జగన్ పర్యటనలో ఘన స్వాగతం, దిష్టి తొలగింపు ఘట్టం హైలైట్!”

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జగన్ పర్యటించి.. తుపాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. రైతులతో మాట్లాడనున్నారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లోని తదితర ప్రాంతాల్లో జగన్ పర్యటన సాగనుంది.కృష్ణా జిల్లాలో పర్యటనలో భాగంగా.. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్‌కి చేరుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడి కాయతో దిష్టి తీశారు. పూలు చల్లుతూ జగన్ మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు.వైఎస్ జగన్ పర్యటనలో పోలీసులు ఆంక్షలు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుతి ఇచ్చారు. అంతేకాదు.. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదని ఆంక్షలు పెట్టారు. జగన్ పర్యటనకు రావొద్దని మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులు ఇచ్చారు.

Scroll to Top