
“నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఉచిత వైద్య సేవలు సద్వినియోగం చేసుకోండి”
పయనించే సూర్యుడు నవంబర్ 4,నంద్యాలజిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల పట్టణం, రైతుబజార్ సమీపంలోని నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు నెరవాటి అరుణకుమారి,వినోద్ కుమార్ లు పేర్కొన్నారు.రైతుబజార్ సమీపంలో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలవరకు ఉచిత వైద్య శిబిరం లయన్స్ క్లబ్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నారు.ఈ వైద్యశిబిరం ప్రముఖ వైద్యులు వినోద్ కుమార్,అరుణకుమారి,సుమన్ కుమార్,ఫాతిమాభి,దేవేంద్ర నాయక్ పాల్గొంటారు.నంద్యాల పట్టణంలో ఎన్నో ఏళ్లుగా నెరవాటి ఆసుపత్రి వైద్యులు మంచిపేరు సంపాదించారు.ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు ఫీజులు రాయితీ ఇస్తూ మంచి వైద్యం అందిస్తున్నారు.ఆసుపత్రికి వచ్చే రోగులకు మంచివైద్యసేవలు అందించడంతో ఆసుపత్రి పెట్టిన కొద్ది రోజుల్లోనే మంచిపేరు సంపాదించుకున్నారు.వ్యాపారాల్లో నెరవాటి బ్రాండ్ ఎలా ప్రాచుర్యం పొందిందో అలాగే వైద్యసేవల్లో నెరవాటి వినోద్ కుమార్,అరుణకుమారి లు మంచిపేరు సంపాదించారు.గతంలో గాంధీ చౌక్ లో ఉన్న ఆసుపత్రిని అన్ని హంగులతో పద్మావతి నగర్ సమీపంలో రైతుబజార్ వద్ద నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఏర్పాటుచేశారు.గతంలో చెవి,ముక్కు,గొంతు కు సంబంధించిన వైద్య సేవలు,ప్రసూతి,స్త్రీ వ్యాధి వైద్యసేవలు అందుబాటులో ఉండేవి.ప్రస్తుతం నూతన ఆసుపత్రిలో మరో ప్రసూతి వైద్యురాలతో పాటు ఎముకలు,కీళ్ల వ్యాధి నిపుణులు ఫాతిమాభి,సుమన్ కుమారులు సైతం మంచి వైద్యం చేయడంతో మంచిపేరు సంపాదించుకున్నారు.నెరవాటి ఆసుపత్రిలో ఎందరో చెవి,ముక్కు సమస్యలు ఉన్నవారు పూర్తిగా జబ్బు నయమైందని చెపుతున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలంటే ఖరీదుగా మారిపోయింది.కొన్ని ఆసుపత్రుల్లో ఓపీ తో పాటు పరీక్షలు వేలకు వేలు తీసుకుంటున్న విషయం విదితమే.ఎంత సంపాదించినా పేదవారికి చేసే సేవలు మరచిపోలేనివని భావించి ప్రతి ఏటా నెరవాటి ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఉచితంగా ఓపీ ,వినికిడి పరీక్షలు,ఎముకల పటిష్ట పరీక్షలు,ఉచిత మందులను పంపిణీ చేస్తున్నారు.వినికిడి మిషన్ కొనుగోలుపై 30 శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తున్నారు.నంద్యాల పట్టణ,గ్రామీణ ప్రాంత ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

