PS Telugu News
Epaper

జోగులాంబ గద్వాల జిల్లా భాగ్యలక్ష్మి హోటల్లో కలుషిత భోజనం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం.

📅 04 Nov 2025 ⏱️ 5:25 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 4 నవంబర్ మంగళవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.

కొత్త హౌసింగ్ బోర్డు సమీపంలో కలెక్టరేట్ ఎదురుగా భాగ్యలక్ష్మి భోజన హోటల్లో కలుషిత భోజనం పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ యజమాని, ఓ వ్యక్తి భోజనం చేస్తుండగా భోజనంలో ఈగ కనిపిస్తే నిర్లక్ష్య ధోరణి తో సమాధానం హోటల్ యజమాని దృష్టికి తీసుకెళ్లగా ఈగని పక్కకు పెట్టు లేదా మళ్లీ కొత్త ప్లేట్లో భోజనం చెయ్యండి తిను అంటు నిర్లక్ష్యమైన సమాధానం చెబుతున్నాడు.ఇదేంటి అని అడుగుతుండగా ఇంతమందికి లేని సమస్య నీ ఒక్కనికి ఎందుకు అంటూ వ్యవహరించడం అక్కడున్న భోజనం ప్రియులను ఆశ్చర్యం గురి చేస్తున్నట్టు ఒక కస్టమర్ మీడియాకు తెలియజేశారు హోటల్ యజమానిపై సంబంధింత అధికారులు తగుచర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు…

Scroll to Top