PS Telugu News
Epaper

బొమ్మల దర్శనమిస్తున్న గాలి మిషన్లు

Listen to this article

పెట్రోల్ బంక్ లో కనీస సౌకర్యాలు కరువు

పెట్రోల్ బంక్ లో నిబంధనలకు నామాలు

పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి టాయిలెట్స్ దుర్వాసన తో అపరిశుభ్రంగా ఉంటున్నాయి

పయనించే సూర్యుడు నవంబరు06 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి అన్ని రకాల పెట్రోల్ బంకులల్లో కస్టమర్లకు కనీస సౌకర్యాలు కల్పించడంలో పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నారు
వాహనదారులకు బంకుల్లో వసతులు ఏమాత్రం అందుబాటులో లేదు రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్న వివిధ రకాల పన్నుల పేరిట టాక్స్ వసూలు చేస్తున్న ప్రభుత్వాలు పెట్రోల్ బంకుల్లో సౌకర్యాలపై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు కస్టమర్లకు భద్రత చర్యలు కూడా బంకుల్లో ఏమి కనబడటం లేదు అని వినియోగదారులు వాపోతున్నారు బొమ్మల దర్శనమిస్తున్న గాలి మిషన్లు నిబంధన ప్రకారం కస్టమర్ కు కల్పించని సౌకర్యాలు పట్టించుకోని అధికారులు ప్రతి బంకుల్లో గాలి నింపే మిషన్ ఉండాలి. కొన్ని బంకుల్లో మాత్రమే పని చేస్తున్నాయి కొన్ని బంకుల్లో మాత్రం బొమ్మల దర్శనమిస్తున్నాయి
వాహనదారులకు గాలి ఉచితంగా నింపాలి కానీ పెట్రోల్ బంక్ యజమానులు ఖర్చుతో కూడుకున్న పని గా భావించి వాటిని ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు రక్షణ చర్యలు కరువు వినియోగదారులకి ఎండా వర్షం దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసే వారి కొరకు విశ్రాంతి షెడ్డును నిర్మించాలి కానీ నామమాత్రంగానే నిర్మించడం జరిగింది పెట్రోల్ బంకుల్లో మూత్రశాలలు త్రాగునీరు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి కానీ కొన్ని పెట్రోల్ బంకుల్లో మూత్రశాలలు కూడా దుర్వాసనతో దర్శనమిస్తున్నాయి త్రాగునీరు కూడా కలుషితంగా దర్శనమిస్తున్నాయి ప్రమాదాలు జరిగితే నీటి ట్యాంకులు బకెట్లో అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలి కానీ అందుబాటులో ఉంచడం లేదు పెట్రోల్ బంకుల్లో ఫస్ట్ ఎయిడ్ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేవు డీజిల్ పెట్రోల్ ధరలు మరియు బంకు యజమాని ఫోన్ నెంబర్లు ధరల బోర్డుపై రాసి పెట్టాలి కానీ పెట్రోల్ బంక్ యజమానులు ఇవేమీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నారు నిబంధనలను గాలి కి వదిలేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు పెట్రోల్ బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని సరైన సౌకర్యాలు కస్టమర్లకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొని వారి రక్షణను కల్పించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు పెట్రోల్ బంక్ సేవలపై సంబంధిత అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు వినియోగదారులకు పెట్రోల్ బంకు వద్ద తమకు జరిగిన నష్టం పై ఆందోళన చేసినప్పుడు మాత్రమే హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత అటువైపు చూసిన పాపానికి లేదు బంకుల్లో ఉండవలసిన సౌకర్యాలు పై అధికారులు తనిఖీ చేసి జరిమానా విధించవచ్చు లేదా బంకులను సీజ్ చేయవచ్చు కానీ పెట్రోల్ బంక్ సంబంధించిన అధికారులకు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు మరి పెట్రోల్ బంక్ యాజమాన్యం పై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారులు ఉన్నారా లేరా అని వేచి చూడాల్సిందే పెట్రోల్ బంక్ నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యుల పై చర్యలు ఉంటాయా ఉండవా అని వినియోగదారులు వాపోతున్నారు పెట్రోల్ బంక్ యాజమాన్యులపై చర్యలు తీసుకొని కనీస సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top