లింబాద్రిగుట్ట దర్శించుకున్న జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో
భీంగల్ మండల మరియు పట్టణ స్థానిక నాయకులతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి గారిని లింబాద్రిగుట్టలో దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్న జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ బిజెపి పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి మరియు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ భీంగల్ మండలంలో రాష్ట్రంలో దేశంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలని రైతుల పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆ లక్ష్మీనరసింహస్వామిని వేడుకుంటూ లింబాద్రిగుట్ట పైన సౌకర్యాల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకొని లక్షలాదిమంది భక్తులు నాలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నారు కాబట్టి వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,వారి వెంటా అసెంబ్లీ కన్వీనర్ మల్కనగారి మోహన్ మండల అధ్యక్షుడు అరె రవీందర్,టౌన్ అధ్యక్షుడు కనికరం మధు, స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నరసయ్య,obc జిల్లా ఉపాధ్యక్షుడు బండారి లక్ష్మణ్ గౌడ్ , మండల ఉపాధ్యక్షుడు మహేందర్,సీనియర్ నాయకులు సంధ్యారాజు,ఉమ్మడ బి జె వై ఎం అధ్యక్షులు శెట్టి ప్రేమ్ చందు, నామాల వెంకటేష్ దయ్య ప్రవీణ్,అంజయ్య మారుతి తదితరులు పాల్గొన్నారు,
