భారీ వర్షాలు, వరదలు – 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఫిలిప్పీన్స్!
పయనించే సూర్యుడు న్యూస్ :ఫిలిప్పీన్స్‌లో కాల్మేగీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్ బీభత్సానికి 114 మందికి పైగా బలయ్యారు. అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలకు మరో 127 మంది గల్లంతయ్యారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపైకి వెళ్లి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నారు. దీంతో దేశ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ తుఫాన్ దాదాపు 20 లక్షల మందిపై ప్రభావం పడిందని, దీంతో 5.6 లక్షల మంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. సెబూ ప్రావిన్స్‌లోని పట్టణాలను వరదలు ముంచెత్తాయని, ఎక్కువ నష్టం అక్కడే జరిగిందని చెప్పారు.