ఏపీలో ఆర్టీసీ బస్సు కాలిపోయిన ఘటన కలకలం – కారణం కోసం విచారణ ప్రారంభం
పయనించే సూర్యుడు న్యూస్ :ఇటీవల తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ వరుస బస్సు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఏపీలో మరో ఆర్టీసీ బస్సు అగ్ని ప్రమాదానికి గురయ్యింది. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం కాగా.. చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం 19 మంది చెందగా.. 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం రొడ్డవలస వద్ద ప్రమాదం చోటుచుసుకుంది. వైశాఖపట్నం నుంచి జైపూర్ వెళ్తున్న ఒడిశా ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. ఉదయం 7.45 గంటలకు ఆంధ్రా- ఒడిశా ఘాట్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఆప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో.. ప్రయాణికుల వెంటనే కిందకు దిగడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. కానీ మంటల్లో మాత్రం పూర్తిగా బస్సు దగ్ధమైంది. స్థానిక సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.