బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడ ప్రాంగణము
ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణము నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి
నిధులు వృధా
కాంట్రాక్టర్ మరియు అధికారులు కలసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి
తూతూ మంత్రంగా మట్టి పోసి బోర్డులు ఏర్పాటు చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి
ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలకు సంబంధించి తెలంగాణ క్రీడా ప్రాంగణం పై ప్రత్యేక అధికారులను నియమించి ఉపయోగం లో వచ్చే విధంగా చర్యలు తీసుకోగలరు
పయనించే సూర్యుడు నవంబర్ 07 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణము అనేది తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఈ ప్రాంగణాలను ఉపాధి హామీ నిధుల సహాయంతో నిర్మించారు క్రీడ సామాగ్రి వాకింగ్ ట్రాక్ లు పిల్లల ఆట వస్తువులు బెంచ్ లు ఉంటాయి అయితే అట్టి తెలంగాణ క్రీడా ప్రాంగణము నిరుపయోగంగా ఉండడం వల్ల అట్టి పనికి పెట్టినటువంటి నిధులు వృధా అయినట్టుగా అందరికీ తెలుస్తూనే ఉంది
ప్రస్తుత పరిస్థితి కొన్ని నివేదికల ప్రకారం కొన్ని క్రీడా ప్రాంగణాలు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయని కేవలం బోర్డుల కు మాత్రమే పరిమితమయ్యాయని తెలుస్తుంది
ప్రతి టీకేపీలో దాదాపు 300 మొక్కలను నాటి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. కానీ అట్టి మొక్కలలు ప్రస్తుతము ఎక్కడ కూడా కనిపించడం లేదు
ఒక్కో క్రీడా ప్రాంగణం కు రెండు నుండి ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేశారు అట్టి రూపాయలు వృధా గత బిఆర్ఎస్ ప్రభుత్వాయహంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నేడు ఆటకు నోచుకోక వెలవెలబోతున్నాయి నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు నేడు అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం మూలంగా అస్తవ్యస్తంగా మారాయి క్రీడా ప్రాంగణాల నిర్మాణం పట్టించుకోకపోవడంతో అవి శిథిల వ్యవస్థకు చేరుకుంటున్నాయి వాటిని ఉపయోగించుకో లేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం క్రీడా ప్రాంగణం నిర్వహణ లేకపోవడంతో చెత్తాచెదారం పిచ్చి మొక్కలతో వెక్కిరిస్తున్నాయి అలాగే క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేకపోవడంతో పశువులకు ఉపయోగకరంగా మారాయి క్రీడా మైదానాలను వినియోగం లోకి తేవాలి జిల్లాలో కోట్ల రూపాయలు నిధులతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయగా ప్రస్తుతం అవి నిరూపయోగంగా ఉండడంతో నిధులు వృధా అయ్యాయి గతంలో ఉన్న క్రీడా మైదానాల్లో మట్టి పోసి నిధులు డ్రా చేశారు కొన్ని ప్రాంతాల్లో ఉపయోగం లేని చోట మట్టి పోసి వాలీబాల్ ఆడేందుకు అవసరమైన స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేశారు ప్రభుత్వ నిబంధన ప్రకారం రన్నింగ్ ట్రాక్ వాలిబాల్ కోర్ట్ యువత కసరత్తులు చేసేందుకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి కానీ దానికి విరుద్ధంగా క్రీడా ప్రాంగణాలను అధికారులు ఏర్పాటు చేశారు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు కలిసి కోట్లలో రూపాయలను సొమ్ము చేసుకున్నారనే వార్త జిల్లా ప్రజలలో బాగా వినిపిస్తుంది మరి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ప్రజాప్రతినిధుల (కాంట్రాక్టర్) మీద అధికారుల మీద ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు కళ్ళకు కట్టినట్టుగా ప్రస్తుత క్రీడా ప్రాంగణాలు కనిపిస్తున్న వాటిని ఎందుకు వినియోగంలోకి తేలేకపోతున్నారో అర్థం కావడం లేదు