PS Telugu News
Epaper

వందేమాతరం గీతం దేశభక్తిని, ఐక్యతను, జాతీయత ప్రతిబింబిస్తుంది.”

📅 07 Nov 2025 ⏱️ 2:35 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 07,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న

జిల్లా ఎస్పి శ్రీ సునీల్ షొరాన్

వందేమాతరం” జాతీయ గీతం భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ముఖ్యమైన పాట,ఈ గీతం నేటికి 150వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ సునీల్ షొరాన్ IPS అధ్వర్యంలో వందేమాతరం గీతాలాపన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వతంత్ర ఉద్యమంలో ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఈ గీతం యొక్క ముఖ్య ఉద్దేశంలో సిబ్బందికి వివరించడం జరిగింది.వందేమాతరం గీతం ను స్వర్గీయ బతిన్ చటర్జీ, 1852లో రచించినటువంటి వందేమాతర గీతాన్ని 1875లో భారత దేశ జాతీయ గీతం గా గుర్తించబడిందని, దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో చూపించిన స్ఫూర్తిని, త్యాగాన్ని గుర్తు చేస్తుందని, గతంలో ప్రజలలో చైతన్యానికి పాటల రూపంలో ఆటల రూపంలో ప్రజలలో చైతన్యాన్ని నింపడానికి ఎంతో ఉపయోగపడేదని, ఈ వందేమాతర గీతం భారతదేశంలో నివసించే అన్ని కులాలు మతాలు భాషలు ప్రాంతాలలో నివసించే ప్రజలలో స్వాతంత్ర్య సంపాదించడానికి ప్రజలను ఏకతాటిపై తేవడానికి ఈ వందేమాతర గీతం ఎంతో స్ఫూర్తిప్రదాయంగా నిలిచిందని అదే స్ఫూర్తిని ప్రజలకు సేవ చేసే క్రమంలో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది కొనసాగించాలని ఎస్పీ ఆకాంక్షించారు.అనంతరం దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది,నలందా స్కూల్ విద్యార్థులు అంతా ఏకమై వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమం జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది తమ దేశభక్తిని, ఐక్యతను, జాతీయత పట్ల తమకున్న అంకితభావాన్ని మరోసారి చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS , జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు గారు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, AR డిఎస్పి శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్లు మోహన్ రెడ్డి, సూర్యమౌళి ,జీవన్ బాబు,రిజర్వు ఇన్స్పెక్టర్లు మంజునాథ్ సురేష్ బాబు , RSI లు, DPO సిబ్బంది ,పోలీసులు ,స్పెషల్ పార్టీ సిబ్బంది స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు.

Scroll to Top