ఘనంగా స్కౌట్ ఫౌండేషన్ డే.
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 7 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల కేంద్రము లోని మండల పరిషత్ నాలుగో నెంబర్ ప్రాథమిక పాఠశాల యందు వందేమాతరం 150 సంవత్సరాల పూర్తి ఐన సందర్భంగా వందేమాతరం గీతాలాపన కార్యక్రమం నిర్వహించిన తరువాత స్కౌట్ ఉద్యమము భారత దేశము లో 1909 సంవత్సరము లో ప్రవేశ పెట్టారు. తంత్య్రయానంతరం 1950 నవంబరు 7 వ తేదీన భారత దేశము లోని వివిధ స్కౌట్ సంస్థలు విలీనము అయి “ది భారత్ స్కౌట్ అండ్ గైడ్స్”అనే ఏకీకృత సంస్థ ఏర్పడింది.ఈ చారిత్రాత్మక సంఘటన గుర్తుగా నవంబర్ 7 న స్కౌట్ ఫౌండేషన్ దినము జరుపుకుంటారు. స్కౌట్ ఉద్యమ కర్త రాబర్ట్ బెడన్ ఫౌల్ యొక్క విశిష్ట సేవలు గురించి, స్కౌట్ ప్రాముఖ్యత, వాటి విధి విధానాలు విద్యార్థులకు ముఖ్య అతిథులు గా హాజరైన కాంప్లెక్స్ చైర్మన్ సీతారామాంజనేయులు వివరించారు, లయన్ క్లబ్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ క్రమశిక్షణ, సాయం, సేవా భావము విద్యార్థులకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం స్కౌట్ చక్కగా ఉపయోగపడుతుందని భావించి తన వంతు గా స్కౌట్ టీమ్ కి 3000 అందించారు. తరువాత స్కౌట్ పిల్లల చేత వేసిన సేవ, సాయం, క్రమశిక్షణ లకు సంబంధించిన నాటకము కార్యక్రమం చక్కగా ఆకట్టుకోవడం జరిగింది. అదేవిదంగా స్కౌట్ ప్లాక్ లీడర్ వరలక్ష్మి తన యూనిట్ పిల్లలకు స్కౌట్ యూనిఫాం, బెల్ట్, ఓకల్,స్కార్ఫ్, వైట్ సాక్స్ లు అందరికి దాదాపు 15000 ఇవ్వడము సంతోషము అని వక్తలు కొనియాడారు.
దేశము లో స్కౌట్ మొదట 1911లో మధ్యప్రదేశ్ లో ఏర్పాటు చేయగా మన భారత దేశము లో అంచెలంచెలుగా అభివృద్ధి చెంది నేటికి ప్రతి పాఠశాల లో అమలు కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ ఉపాద్యాయులు శైలజ కుమారి, రవీంద్ర,స్కౌట్ మాస్టర్ వరలక్ష్మి, పద్మావతి, రంగస్వామి రెడ్డి, నాగలక్ష్మి విద్యా కమిటీ చైర్మన్ సీతారామయ్య తదితరులు పాల్గొ

