కారు బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు
పోసంపల్లి గ్రామానికి చెందిన రాములకు తీవ్ర గాయాలు”
(పయనించే సూర్యుడు నవంబర్ 8 రాజేష్)
దౌల్తాబాద్ మండల కేంద్రంలో కారు బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి .పోసంపల్లి గ్రామానికి చెందిన అబ్రబోయిన రాములు 50 M బైకుపై వెళుతున్న క్రమంలో కొనాయిపల్లి సమ్మక్క సారలమ్మ టెంపుల్ సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్న ఘటనల్లో బైక్ పై ఉన్న రామునికి రెండు కాళ్లు తీవ్ర గాయాల పాలైన ఘటనలు పేర్కొన్నారు. ఘటనలో రాములుకి రెండు కాళ్లు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చూచి 108కు అంబులెన్స్ కి సమాచారం ఇవ్వగా అందుబాటులో ఉన్న అక్బర్ పేట భూంపల్లి 108 సిబ్బంది మెడికల్ టెక్నీషియన్ నర్సింలు మరియు పైలెట్ కుమారులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకొని ప్రధమ చికిత్స అందించి స్థానిక ప్రభుత్వ ఏరియా గజ్వేల్ హాస్పిటల్ కు తరలించడం జరిగింది.
] +91 97011 36409: End
