ఈరన్న స్వామి ఆలయంలో హుండీ ఆదాయం అంచనాలను దాటేసింది
పయనించే సూర్యుడు న్యూస్ :కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం లోని ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయ హుండీ ఆదాయం అంచనాలకు అందని విధంగా పెరిగిపోతోంది. ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందుతున్న ఆలయం ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం. కౌతాళం మండలం ఉరుకుంద లో వెలసిన ఈరన్న స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. శ్రీశైలం తర్వాత ఆ స్థాయిలో అత్యధిక హుండీ ఆదాయం ఉన్న టెంపుల్ ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయం కావడం విశేషం. గత రెండు నెలల నుండి ఆదాయాన్ని నిన్న ఆలయ అధికారులు సీసీ కెమెరాల సమక్షంలో లెక్కించారు. నగదు ₹ 1,37,79,215 కాగా బంగారు ఊహించనంతగా భక్తులు సమర్పించారు.6.750 కిలోల బంగారం రాగా వెండి కూడా 18.990 కిలోలు రావడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కర్ణాటక తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఇటీవల కాలంలో ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయాన్ని కూడా సౌకర్యాలను కూడా విస్తరించాలని భక్తులు కోరుతున్నారు