జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైన శివకుమార్
{పయనంజే సూర్యుడు} {నవంబర్ 9}మక్తల్}
మక్తల్ మండలం కర్ని గ్రామానికి చెందిన కొండపల్లి శేఖర్ మణెమ్మ కుమారుడు కొండ పల్లి శివకుమార్ , జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కర్ని లో ప్రస్తుతము పదవ తరగతి చదువుతున్న శివకుమార్ క్రీడలపై మక్కువ పెంచుకొని, పాఠశాల పిడి బీ.రూప దగ్గర షూటింగ్ బాల్ క్రీడల్లో మెరుగైన శిక్షణ పొంది, మక్తల్ లో 2023 జూలైలో జరిగిన జిల్లా షూటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి, రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై, ఆగస్టు 2023 మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ లో జరిగిన షూటింగ్ బాల్ క్రీడల్లో పాల్గొని ప్రశంసా పత్రం పొందినాడు. అలాగే 2024 డిసెంబర్లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో జరిగిన జూనియర్ షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొని ప్రశంసా పత్రం పొందినాడు. అలాగే 2025 మార్చి లో నల్లగొండ లో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొని ప్రశంసా పత్రము , సిల్వర్ మెడల్ సాధించినాడు. అలాగే నారాయణపేట జిల్లా బిజ్వార్ ల్లో జరిగిన జూనియర్ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని సర్టిఫికెట్ పొందినాడు. 2025 సెప్టెంబర్ 22 నుండి 24 వరకు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు లో జరిగిన జూనియర్ షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొని మూడో స్థానం పొంది, జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైనట్లు పాఠశాల పిడి బి. రూప తెలిపారు. జాతీయస్థాయి షూటింగ్ బాలు కూడలకు ఎంపికైన శివకుమార్ ఈనెల 7 నుండి 10 వరకు . ఉత్తర ప్రదేశ్ గజియాబాద్ లో జరుగుతున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ క్రీడల్లో తెలంగాణ జట్టు తరఫున ఆడుతున్నాడని ఆమె సంతోషాన్ని వ్యక్తపరిచారు. జాతీయస్థాయి షూటింగ్ బాల్ క్రీడలకు ఎంపికైన కొండపల్లి శివకుమార్ ను, అందుకు కృషిచేసిన పిడి బి .రూపను, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం. శ్రీనివాసులు, సిహెచ్. ఐలయ్య. ఉపాధ్యక్షుడు బి.గోపాలం ,జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సత్యాంజనేయులు, రమేష్ కుమార్, పాఠశాల హెచ్ఎం వెంకటయ్య, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, ప్రజలు అభినందించారు. జాతీయస్థాయి క్రీడలకు ఎంపికైన శివకుమార్ మాట్లాడుతూ మా తల్లిదండ్రుల పేదరికాన్ని గుర్తించి, క్రీడల్లో రాణించాలని తపన, ఉత్సాహంతో మా పాఠశాల పిడి బి. రూప దగ్గర క్రీడా మెలకువలు నేర్చుకొని జాతీయస్థాయిలో రాణించి స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం గానీ, పిఈటిగా రాణించాలని నా ప్రథమ లక్షమని శివకుమార్ తెలిపారు.