“(మస్జిద్-ఏ-అబ్బాస్ ర.జి)నూతన మసీదు ప్రారంభోత్సవం”
పయనించే సూర్యుడు నవంబర్ 08,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
మసీదు నిర్మాణానికి హిందూ,ముస్లింలు అందరూ సహాయ, సహకారాలు అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు.. మసీదు కమిటి,శ్రీ జగజ్జనని ఆలయ కమిటీ వారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. మసీదు కమిటీ,మధ్యాహ్నం అందరికీ అన్నదాన వితరణ కార్యక్రమం,పట్టణంలోని స్థానిక జగజ్జనని నగర్ లో వెలసిన శ్రీ జగజ్జనని ఆలయం దాటిన కొద్ది దూరంలో మస్జిద్-ఏ-అబ్బాస్ ర.జి పేరున నూతన మసీదు నిర్మాణం పూర్తయి 9/11/25 ఆదివారం రోజున ప్రారంభమౌతున్న సందర్భంగా మసీదు నందు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారని ఈ కార్యక్రమంలో అందరూ కులమ తాలకతీతంగా అందరు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో భాగస్వాములు కావాలని అల్లాహ్ కృపకు అందరు పాత్రులు అవ్వాలని మసీదు కమిటీ వారు తెలిపారు.ఈ సందర్భంగా మస్జిద్ కమిటీ వారు మాట్లాడుతూ ఈ మసీదు నిర్మాణంలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వారి వారి శక్తికనుకూలంగా మాకు సహాయ సహకారాలు అందించి ఈ మసీదు నిర్మాణాన్ని పూర్తయింతవరకు తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం మధ్యాహ్నం భోజన సదుపాయం, అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో మసీదు ముత్తవల్లి ఎస్ యూనుస్,సెక్రటరీ గౌస్ మొద్దీన్, జాయింట్ సెక్రటరీ అమీర్ భాష, కమిటి సభ్యులు.. టైలర్ మిషన్ మక్బూల్,యూ.సి.డి. బ్యాంక్ మక్బుల్, ఆబిద్ అలి,ఇనాయతుల్ల,షుకుర్,మగ్బుల్ బాష తదితర కమిటీ సభ్యులు, పరిసర స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

