యువత మాదక ద్రవ్యాలు సేవించి ద్విచక్రవాహంతో ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారు
పయనించే సూర్యుడు నవంబర్ 10 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట పట్టణంలో కొంతకాలంగా యువకులు బహిరంగంగానే తాగిన మత్తులో ద్విచక్ర వాహనాలను మితిమీరిన వేగంతో బజార్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు అలాంటి సంఘటన ఈరోజు సాయంత్రం వస్త్రా సాగర్ సమీపంలో ద్విచక్ర వాహనా మీద ఇద్దరు వ్యక్తులు మత్తులో బజారువీధుల్లో అతివేగంతో వెళ్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇద్దరు వ్యక్తులకు ద్విచక్ర వాహనం తగిలి కింద పడిపోయారు వెంటనే చుట్టుపక్కల వారు స్పందించి ద్విచక్రవాహనాన్న పట్టుకున్నారు ఆ ఇద్దరిలో ఒక అతను పారిపోగా ఒక అతను పట్టుకొని పోలీసు వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించగా వెంటనే పోలీసు వారు స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని అ ద్విచక్ర వాహనాన్ని ఒక అతన్ని తీసుకొని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్లారు పోలీసువారికి సమాచారం అందించిన పదినిమిషాలనే సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ జరిగిన ప్రాబ్లంని క్లియర్ చేశారు బజారు లో ఉన్న ప్రజలంతా పోలీసు వారికి ధన్యవాదాలు తెలిపారు సూళ్లూరుపేట పోలీస్ వారు ప్రజలకు అందుబాటులో ఉన్నారని ఇదొక నిదర్శనం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజల ధైర్యంగా పోలీస్ స్టేషన్ కి ఫోన్ ద్వారా సమాచారం అందించాలని పోలీసు వారి విజ్ఞప్తి
