PS Telugu News
Epaper

జూలూరుపాడు కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.

📅 10 Nov 2025 ⏱️ 6:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 10(పొనకంటి ఉపేందర్ రావు)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:సోమవారం జూలూరుపాడు లోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ)ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ సందర్శించారు. ఈ సందర్శనలో ఆయన విద్యార్థినులతో ఆత్మీయంగా మాట్లాడి, వారి విద్యా స్థాయి, వసతి, భోజనం మరియు రోజువారీ జీవన విధానం గురించి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ పాఠశాలలోని తరగతి గదులు, వంటశాల, భోజనశాల, తాగునీటి సదుపాయాలు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను పరిశీలించారు. ప్రత్యేకంగా క వంటగదిలో వంట కోసం ఉపయోగించే సామాగ్రిని, వంట పాత్రలను, పదార్థాల నిల్వ పద్ధతులను, ఆహార తయారీ సమయంలో పాటిస్తున్న పరిశుభ్రతా ప్రమాణాలను వివరంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజన నాణ్యతను స్వయంగా తనిఖీ చేసి, వారితో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా భాగంగా కలెక్టర్ తరగతి గదిలో విద్యార్థులను ప్రశ్నలు అడిగి వారి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని విద్యా సదుపాయాలు కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రశాంతమైన, భద్రమైన వాతావరణంలో చదువుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.విద్యార్థులు క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదలతో చదువుకుని జీవితంలో ఉన్నత స్థానాలను సాధించాలని ప్రోత్సహించారు. విద్యార్థుల అభ్యాసంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి, వారిని పోటీ ప్రపంచానికి సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.అలాగే, పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలని, మౌలిక సదుపాయాల పరంగా ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచే దిశగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట బోధన బోధ నేతల సిబ్బంది మరియు విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top