ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి :-సిఐటియు డిమాండ్
పయనించే సూర్యుడు నవంబర్ 10,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
“కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు కార్మికులు, ఉద్యోగులు ఐక్యం కావాలి.
ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది గంటల పని విధానం కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పింది,తడవుగా కార్మికుల శ్రమను దోచుకునేందుకు, నరేంద్ర మోడీ మెప్పు కోసం 10 గంటల పని విధానాన్ని నేటి నుండి అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం సరైనది కాదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు నాగరాజు,జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, కల్లా. మహమ్మద్ గౌస్, జిల్లా కార్యదర్శులు దర్శనం.లక్ష్మణ్, వెన్న. బాల వెంకట్ లు అన్నారు స్థానిక సిఐటియు కార్యాలయంలో వారు మాట్లాడుతూ రోజుకు 24 గంటల పాటు ఉంటే ఎనిమిది గంటలు పని చేయాలి. ఎనిమిది గంటలు కుటుంబం అవసరాల కోసం వినియోగించుకోవాలి 8 గంటల పాటు నిద్ర పోవాలి. అప్పుడే మనిషి ఆరోగ్యకరంగా ఉండి అన్ని రకాల పనులు చేయగలరని అలా కాకుండా ఎనిమిది గంటల పని విధానం కొనసాగించకుండా 10 గంటల పాటు పనులు చేయాలని చెప్పడం అంటే పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కార్మికుల శ్రమను దోచుకోండని తలుపులు తీయడమే అని దీనివలన కార్మికులు పనులు చేయలేక కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడంలో వెనుకబడే అవకాశం ఉందని అన్నారు కార్మికుల,ఉద్యోగుల శ్రమను దోచుకున్న ప్రభుత్వాలు గతంలో కూలిపోయాయని, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం లక్షలాది మంది కార్మికుల ప్రాణాలు అర్పించి పోరాడి సాధించుకున్న ఎనిమిది గంటల పని విధానాన్ని తుంగలో తొక్కడం అంటే తన గొయ్యిని తనే తవ్వుకుని భూస్థాపితం అయ్యే అవకాశం ఉందని, కార్మికులను,ఉద్యోగులను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం రోబోలాగా చూడడం సరైనది కాదని, ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే కార్మికులంతా, ఉద్యోగులంతా కలిసి కూటమి ప్రభుత్వాన్ని సమాధి చేస్తారని హెచ్చరించారు.అభివందనములతో దర్శనం.లక్ష్మణ్ సిఐటియు జిల్లా కార్యదర్శి, నంద్యాల.