PS Telugu News
Epaper

అల్లు శిరీష్ రియాక్షన్ ఫైర్! ఎంగేజ్మెంట్ లుక్ చూసి చెప్పిన మాటలు వైరల్!

📅 11 Nov 2025 ⏱️ 12:03 PM 📝 సినిమా-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :అల్లు శిరీష్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అవుతున్నారో అందరికీ తెలిసిందే. ఎంగేజ్మెంట్‌కు సంబంధించిన ఫోటోలు, కొత్త జంట వేసుకున్న క్యాస్టూమ్స్ ఇలా అన్నీ కూడా ట్రెండ్ అయ్యాయి. ఇక మరీ ముఖ్యంగా అల్లు శిరీష్ మెడలో కనిపించిన నెక్లెస్ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. స్టైలీష్ ఐకాన్ అంటూ నెట్టింట్లో అల్లు ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. అయితే ఇతరులు మాత్రం అల్లు శిరీష్ స్టైల్‌ను ట్రోల్ చేస్తున్నారు. మెడలో నెక్లెస్ ఏంటి? ఆడవాళ్లలా అలా వేసుకున్నావ్ ఏంటి? అని నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. అయితే ఒకప్పుడు రాజులు అయితే అన్ని రకాలుగా నగలు ధరించేవారు కదా? అని అల్లు శిరీష్‌కు సపోర్ట్‌గా కొంత మంది నెటిజన్లు కామెంట్ చేశారు. అయితే ఈ ట్రోలింగ్ విషయం అల్లు శిరీష్ చెవిన పడినట్టుగా ఉంది. దీంతో తన వైపు నుంచి వివరణ ఇచ్చుకున్నాడు. ఎంగేజ్మెంట్‌కి నెక్లెస్ వేసుకున్నాడు.. పెళ్లికి వడ్డాణం పెట్టుకుంటే ఏమైపోతారో అని ఓ మీమ్ వేశారు. ఆ మీమ్ మీద అల్లు శిరీష్ రియాక్ట్ అయ్యాడు. హహహ అని నవ్వుతూ.. వడ్డాణం అనేది మహిళలు ధరిస్తారు బ్రో.. అయినా మన రాజులు, మొగలులు కూడా ధరించేవారు అంటూ కౌంటర్ వేశాడు. అంటే పెళ్లికి కూడా ఇలానే డిఫరెంట్ క్యాస్టూమ్స్, నగతో కనిపించేలా ఉన్నాడు. నైనికతో రెండేళ్ల ప్రేమ ప్రయాణాన్ని పెళ్లి పీటల వరకు అల్లు శిరీష్ తీసుకు వచ్చాడు. నితిన్ భార్య షాలినీ ఫ్రెండ్ అయిన నైనికతో అల్లు శిరీష్ ప్రేమాయణం నడిపించాడు. షాలినీ పెళ్లిలోనే నైనికను అల్లు శిరీష్ చూశాడట. అక్కడ మొదలైన పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు రాబోతోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే వీరి పెళ్లి ఘనంగా జరగనుందని సమాచారం.

Scroll to Top