PS Telugu News
Epaper

ఢిల్లీ పేలుడు ఘటనపై సెన్సేషనల్ రివీలేషన్స్ – పోలీసులు కీలక ఆధారాలు సొంతం చేసుకున్నారు!

📅 11 Nov 2025 ⏱️ 12:36 PM 📝 జాతీయ-వార్తలు
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ రాజధాని ఢిల్లీలో భారీ బాంబు పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ చేసిన ఓ ఐ20 కారులో బాంబు అమర్చినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన కారుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. నిన్న( సోమవారం) సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడు ఘటనకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి ఐ20 కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. అతడు డాక్టర్ మహ్మద్‌ ఉమర్‌‌గా గుర్తించారు. ఫరీదాబాద్ మాడ్యూల్‌తో ఇతడికి సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కారు రుగ్రామ్ ఆర్టీవో కార్యాలయంలో మహమ్మద్ సల్మాన్ పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఈ సమాచారం ఆధారంగా మహమ్మద్ సల్మాన్‌ను అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే, తాను ఆ కారును పుల్వామా నివాసి తారిక్‌ కొనుగోలు చేసినట్లు విచారణలో సల్మాన్ తెలిపాడు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న అధికారులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, అన్ని కోణాల్లోనూ విచారణను వేగవంతం చేశాయి.  ఈ క్రమంలో ఘటనకు ముందు కారు సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

Scroll to Top